రియల్ హీరో సంపూర్ణేష్ బాబు.. అమ్మానాన్న లేని అనాధలకు ఆర్థిక సాయం

రియల్ హీరో సంపూర్ణేష్ బాబు.. అమ్మానాన్న లేని అనాధలకు ఆర్థిక సాయం
చిన్న చిత్రాలలో నటించే పెద్ద మనసున్న హీరో సంపూర్ణేష్ బాబు.

కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే భారీ బడ్జెట్ చిత్రాల హీరో కాదు. చిన్న చిత్రాలలో నటించే పెద్ద మనసున్న హీరో సంపూర్ణేష్ బాబు. నటుడిగా నలుగురినీ నవ్వించే సినిమాల్లో నటిస్తాడు. తాను సంపాదించుకున్నదాంట్లో తోటి వారికి సాయపడుతూ కొండంత అండగా నిలుస్తాడు. తాజాగా దుబ్బాకలో నరసింహాచారి దంపతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి ఇద్దరు చిన్నారులు గాయత్రి, లక్ష్మీప్రియలు అనాధలయ్యారనే వార్త చదివి చలించి పోయాడు.

తన వంతు సాయం ఆ చిన్నారులకు అందించాలని అనుకున్నారు. 25 వేల రూపాయల చెక్కును చిన్నారులకు అందించారు. అంతేకాదు వారిద్దరు చదువుకునేందుకు అయ్యే ఖర్చును తాను, కొబ్బరిమట్ట, హృదయ కాలేయం నిర్మాత సాయి రాజేష్ కలిసి చూసుకుంటామని అన్నారు. ఈ కష్టకాలంలో తోటి వ్యక్తులకు సాయం అందించడం మన కర్తవ్యం అని సంపూర్ణేష్ అన్నారు.

ఇటీవల కరోనా కాటుకు బలైన జర్నలిస్ట్ టీఎన్ఆర్ కుటుంబానికి సంపూర్ణేష్ బాబు రూ.50వేలు అందించి తన సహృదయతను చాటుకున్నారు. కాగా ప్రస్తుతం సంపూ.. బజారు రౌడీ, కాలీప్లవర్, పుడింగి నంబర్ వన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 2019లో విడుదలైన కొబ్బరిమట్ట చిత్రంతో సంపూర్ణేష్ హిట్ అందుకున్నారు. కాగా ప్రస్తుతం సంపూ.. 'బజారు రౌడీ, క్చాలీఫ్లవర్‌, పుడింగి నంబర్‌ వన్‌' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 2019లో విడుదలైన కొబ్బరిమట్ట చిత్రంతో సంపూ హిట్‌ అందుకున్నారు.

Tags

Next Story