Shine Tom Chacko : డ్రగ్స్ కేస్ లో దసరా విలన్

డ్రగ్స్ అనగానే అందరికీ టాలీవుడ్ గుర్తొస్తుంది. కానీ టాలీవుడ్ కంటే ఎక్కువగా ఈ వ్వవహారాలు మళయాల పరిశ్రమలో కనిపిస్తాయని చెబుతారు. తాజాగా టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో పై డ్రగ్స్ తీసుకున్నాడు అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీస్ లు అలెర్ట్ అయ్యి అతన్ని పట్టుకోవడానికి వెళ్లారు. విషయం తెలిసిన షైన్ టామ్ తను ఉంటోన్న హోటెల్ నుంచి పారిపోయాడు. అయితే అతను డ్రగ్స్ తీసుకున్న విషయం చెప్పింది తోటి నటి కావడం విశేషం. విన్సీ అల్ఫోన్సియస్ అనే నటితో అతను షూటింగ్ టైమ్ లో అసభ్యంగా ప్రవర్తించాడట. ఆ టైమ్ లో అతను డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని తను చెప్పడంతో పోలీస్ లు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అతను పారిపోయినా.. హోటెల్ లో డ్రగ్స్ కు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయట. దీంతో షైన్ టామ్ చాకో పెద్ద సమస్యనే ఫేస్ చేయబోతున్నాడు అంటున్నారు.
మళయాలంలో మంచి పేరున్న నటుడు షైన్ టామ్. తెలుగులో దసరా చిత్రంతో పరిచయం అయ్యాడు. ఈ మూవీలో విలన్ గా చాలాబాగా నటించాడు. తర్వాత రంగబలి, దేవర, డాకూ మహారాజ్, రాబిన్ హుడ్ వంటి మూవీస్ తో తెలుగువారినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా వచ్చిన అజిత్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీలో ఓ సీన్ లో మాత్రమే కనిపించాడు. మొత్తంగా సెట్స్ లోనే చెడు ప్రవర్తనతో అసలుకే ఎసరు తెచ్చుకున్నాడు షైన్ టామ్ చాకో. మరి ఈ కేస్ ఎటు తేలుతుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com