Shine Tom Chako : దసరా విలన్ కు యాక్సిడెంట్.. తీవ్ర విషాదం

Shine Tom Chako :  దసరా విలన్ కు యాక్సిడెంట్.. తీవ్ర విషాదం
X

దసరా మూవీలో విలన్ గా తిరుగులేని ముద్ర వేసిన నటుడు షైన్ టామ్ చాకో. స్వతహాగా మళయాలీ అయిన షైన్ టామ్.. అక్కడా విభిన్నమైన పాత్రల్లో విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్ లోనూ ఆఫర్స్ అందుకుంటున్నాడు. రీసెంట్ గా అతను డ్రగ్స్ తీసుకుని తోటి నటితో అసభ్యంగా ప్రవర్తించాడు అనే కేస్ లో సంచలనంగా మారాడు. ప్రస్తుతం ఆ కేస్ విచారణలోనే ఉంది. అయితే తాజాగా షైన్ టామ్ తన ఫ్యామిలీతో కలిసి కార్ లో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతని తండ్రి సి.పి చాకో అక్కడిక్కడే మరణించాడు. షైన్ టామ్ తో పాటు అతని తల్లి, సోదరుడికి దెబ్బబలు తగిలాయి. ప్రస్తుతం అంతా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. షైన్ తో పాటు మిగిలిన ఇద్దరికీ పలు ఫ్రాక్చర్స్ అయ్యాయి.

ప్రస్తుతం షైన్ టామ్ మళయాలంలోనే నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అతనేమీ చిన్న నటుడు కాదు. కీలకమైన పాత్రలే చేస్తున్నాడు. దీంతో ీ సినిమాల రిలీజ్ డేట్స్ పై ప్రభావం పడొచ్చు. ఏదేమైనా ఈ విషాదం నుంచి అతని ఫ్యామిలీ త్వరగా కోలుకుని తిరిగి ఆరోగ్యంగా మారాలని కోరుకుందాం.

Tags

Next Story