యాక్టర్ శివాజీ రాజాకు ఏమైంది.. ఎందుకలా..

యాక్టర్ శివాజీ రాజాకు ఏమైంది.. ఎందుకలా..
అటు బుల్లితెర మీద కనిపించినా, ఇటు వెండి తెర మీద కనిపించినా ఎంతో యాక్టివ్‌గా ఉండే శివాజీ రాజా

అటు బుల్లితెర మీద కనిపించినా, ఇటు వెండి తెర మీద కనిపించినా ఎంతో యాక్టివ్‌గా ఉండే శివాజీ రాజా గత కొంత కాలంగా స్క్రీన్‌కి దూరంగా ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసిన శివాజీ రాజా కొన్ని వందల సినిమాల్లో నటించారు. కానీ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. గతఏడాది గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.

ఇంతకాలం మీడియాకు దూరంగా ఉన్న ఆయన తన కొడుకు వినయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'వేయు శుభములు కలుగు నీకు' చిత్రంలోని ఓ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుండెపోటు వచ్చాక బరువు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. 400 చిత్రాలకు పైగా చేసిన శివాజీ రాజా కొంతకాలం మా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆరోగ్య రిత్యా నటనకు దూరంగా ఉన్నారు. అంతా సర్దుకున్నాక అవకాశం వస్తే మళ్లీ నటించొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story