Hero Suriya : రియల్ 'సినతల్లి' అకౌంట్‌లో రూ.10లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సూర్య..!
Hero Suriya : తమిళ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'జై భీమ్'. రాజకన్ను, పార్వతమ్మ అనే రియల్ పాత్రలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు టీజే. జ్ఞానవేల్.. అమెజాన్ ప్రైమ్‌లో తాజాగా విడుదలైన ఈ సినిమా అభిమానుల మన్ననలు పొందుతోంది. ప్రేక్షకులతో పాటుగా సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాని చూసి మెచ్చుకుంటున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సినిమాని చూసి హీరో సూర్యకు ఏకంగా లేఖ రాశారు. ఇక ఈ సినిమాని చూసి చలించిపోయారు దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్.. రియల్ సినతల్లి అయిన పార్వతమ్మకు సొంతిల్లు కట్టిస్తానని అన్నారు. అటు హీరో సూర్య కూడా ఆమెకి ఆర్థిక సహాయం చేస్తానని వెల్లడించాడు. అన్నట్టుగానే పార్వతమ్మ పేర బ్యాంకులో రూ. 10లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఈ విషయాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్థ అయిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించింది.
An FD of 10 lakhs from #Suriya sir for the benefit of Parvathy Ammal, the wife of Late Rajakannu. Wonderful gesture yet again👌#JaiBhim - the most impactful Indian film in recent times. It's REAL! https://t.co/eoB4OQu6up
— Kaushik LM (@LMKMovieManiac) November 14, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com