Actor Surya: సూర్య కల ఫలించే వేళ..

Actor Surya: సూర్య కల ఫలించే వేళ..
Actor Surya: కోలీవుడ్‌లో సూపర్ స్టార్ అయినా తెలుగు ప్రేక్షకుల హదయాల్నీ దోచుకున్నాడు నటుడు సూర్య.

Actor Surya: కోలీవుడ్‌లో సూపర్ స్టార్ అయినా తెలుగు ప్రేక్షకుల హదయాల్నీ దోచుకున్నాడు నటుడు సూర్య. అతడి సినిమాలే కాదు వ్యక్తిత్వమూ అభిమానులను అతడికి దగ్గర చేసింది. సూర్యకు కూడా తెలుగువారన్నా, తెలుగు సినిమాలన్నా చాలా ఇష్టం.. నేరుగా తెలుగులో ఓ సినిమా చేయాలని సూర్యకు ఎప్పటి నుంచో కోరిక.. తెలుగు అగ్ర నిర్మాతలు సూర్యతో తెలుగులో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు... కానీ ఆ ప్రయత్నాలు ఫలించట్లేదు..

ఇటీవల బోయపాటి శ్రీను.. సూర్యకు ఓ కథ వినిపించగా ఆయన కూడా ఓకే అన్నారు.. కానీ అది మాటల వరకే పరిమితమైంది.. ముందుకు వెళ్లలేదు.. ఈ క్రమంలో మరో దర్శకుడు వినిపించిన కథకు సూర్య ఓకే చేసినట్లు తెలుస్తోంది.. ఈ ద్విభాషా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు సమాచారం. అన్నాత్తే ఫేం దర్శకుడు శివ తెరకెక్కించనున్న ఈ చిత్ర కథ సూర్యకు నచ్చడంతో ఓకే చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. సూర్య ప్రస్తుతం బాలా దర్శకత్వంలో అచలుడు చిత్రం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story