Tarakaratna: తారకరత్న పరిస్థితి విషమం.. చికిత్స కోసం బెంగళూరుకు

Tarakaratna: తారకరత్న పరిస్థితి విషమం.. చికిత్స కోసం బెంగళూరుకు
Tarakaratna: తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తెలుగు నటుడు, రాజకీయ నాయకుడు తారకరత్న

Tarakaratna: తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తెలుగు నటుడు, రాజకీయ నాయకుడు తారకరత్న స్వల్ప అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా వైద్యులు అతడికి అత్యవసర చికిత్స అందించారు. అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉందని గుర్తించారు వైద్యులు.

శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. తారకరత్న పీఈఎస్‌లో ఉండగానే శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తె ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం. .

తారకరత్న రోడ్ షోలో పాల్గొన్న సమయంలో పలువురు అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. జనం తాకిడికి తూలి పడబోయిన అతడిని టీడీపీ పార్టీ సభ్యులు పడిపోకుండా పట్టుకున్నారు. అప్పటికే అతడికి కళ్లు బైర్లు కమ్మాయి. దీంతో అతడిని కుప్పం ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన గుండెపోటుకు గురైనట్లు వైద్యులు తెలుసుకున్నారు.

హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ నిన్న రాత్రి 9 గంటల వరకు తారకరత్నతోనే ఉన్నారు. అతడిని చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లే వరకు కుప్పం ఆసుపత్రిలో ఆయనతో ఉన్నారు. జూ.ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తారకరత్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని బెంగుళూరు హృదయాలయ వైద్య నిపుణుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోందని సమాచారం.

అతని ఎడమవాల్వ్‌ 90% వరకు బ్లాక్ అవడం వల్ల గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని బెంగళూరు వైద్యులు తెలిపారు. అయితే అతని BP సాధారణంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

తారకరత్న 2002లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'ఒకటో నంబర్ కుర్రాడు' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసారు. వచ్చే ఏడాది ఏపీలో టీడీపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story