నటుడు విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య..

తమిళ సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని కుమార్తె మీరా చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె వయస్సు 16 సంవత్సరాలు.
మీరా సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని తమ నివాసంలో ఉరివేసుకుని కనిపించడంతో హతాశులైన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మీరాను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. నివేదికల ప్రకారం, ఆమె డిప్రెషన్ లో ఉందని దాని కోసం చికిత్స పొందుతోందని తెలుస్తోంది.
విజయ్ ఆంటోనీ తన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అతని రాబోయే చిత్రం 'రథం' విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఆయన చెన్నైలో నిర్వహించిన సంగీత కచేరీ భారీ విజయాన్ని అందుకుంది.
విజయ్ ఆంటోనీ కుటుంబం చెన్నైలోని అల్వార్‌పేట్‌లో నివసిస్తోంది. తెల్లవారుజామున 3 గంటలకు అతని కుమార్తె మీరా శవమై కనిపించడంతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఆమె చెన్నైలోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది.
విజయ్ ఆంటోని ఫాతిమాని వివాహం చేసుకున్నారు. ఆమె వారి స్వంత ప్రొడక్షన్ హౌస్‌ను చూసుకుంటుంది. విజయ్, ఫాతిమాలకు ఇద్దరు కుమార్తెలు మీరా, లారా ఉన్నారు. మీరా ఇలా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడం ఆ దంపతులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com