Vijay Thalapathy : రోల్స్‌రాయిస్ కారును అమ్మెసిన హీరో విజయ్
తమిళ హీరో విజయ్ 2012లో రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. ఇష్టంగా కొనుక్కున్న ఆ కారు కోసం అప్పట్లో లీగల్ ట్రబుల్స్ కూడా ఫేస్ చేశారు. ఇప్పుడు ఆ కారును ఆయన అమ్మకానికి పెట్టడం తమిళనాట హాట్ టాపిక్గా మారింది. సుమారు రూ.2.6 కోట్లకు విజయ్ కారును అమ్మనున్నట్లు ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్ షిప్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. పార్టీని నడిపేందుకే విజయ్ కారును అమ్ముతున్నారేమోనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఒక సిరీస్ I మోడల్ కారు కండిషన్ చూస్తే..ప్రస్తుతం, ఈ 12 ఏళ్ల లగ్జరీ సెడాన్ మంచికండీషన్ లోనే ఉంది. కొనుగోలు చేసినప్పటి నుండి అన్ని సర్వీస్ రికార్డ్‌లను కలిగి ఉంది.ఈ రోల్స్ రాయిస్ పై ఓడోమీటర్ రీడింగ్ 22,000 కి.మీ. కారు లోపల,బయట అన్ని ఎలక్ట్రానిక్స్ మరియు ఫీచర్లు రోల్స్ రాయిస్ రూపొందించిన విధంగా పని చేస్తున్నాయని వెల్లడించారు. ధర విషయానికొస్తే, హీరో విజయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ I కోసం డీలర్‌షిప్ రూ. 2.6 కోట్లు కోట్ చేసింది. ఇప్పుడు ఈ ధర హాట్ టాపిక్గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com