Ponniyin Selvan: బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడానికి భారీ క్యాస్టింగ్‌తో మణిరత్నం..

Ponniyin Selvan I (tv5news.in)

Ponniyin Selvan I (tv5news.in)

Ponniyin Selvan: 'పొన్నియన్​ సెల్వన్'కి రెండు భాగాలు అవసరమని.. మణిరత్నం ముందుగానే నిర్ణయించుకున్నాడు.

Ponniyin Selvan: కేవలం తెలుగు సినిమానే కాదు.. భారతీయ సినిమానే అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది 'బాహుబలి'. ప్రస్తుతం తెలుగులో బాహుబలి రికార్డ్స్, నాన్ బాహుబలి రికార్డ్స్‌తోనే సినిమాల రికార్డుల లెక్కలు జరుగుతున్నాయి. అయితే ఈ రికార్డులను తిరగరాయడానికి ఇప్పటికీ ఎన్నో సినిమాలు ప్రయత్నించినా కుదరలేదు. ప్రస్తుతం ఇలాంటి ప్రయోగానికి సిద్ధమయ్యాడు మణిరత్నం. తాను తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం 'పొన్నియన్​ సెల్వన్' విడుదల తేదీని అనౌన్స్ చేశాడు మణిరత్నం.


ఒకప్పుడు చారిత్రక సినిమాలకు పెద్దగా క్రేజ్ ఉండేది కాదు.. కానీ బాహుబలితో మరోసారి ఇలాంటి చిత్రాలకు ఆదరణ లభించింది. భారీ బడ్జెట్‌తో చారిత్రక సినిమాలను తెరకెక్కించాలని స్టార్ డైరెక్టర్లు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే అదే తరహాలో మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రమే 'పొన్నియన్​ సెల్వన్'. ఇందులో దాదాపు 10 మంది స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వారిలో పలువురి ఫస్ట్ లుక్స్ ఇప్పటికే విడుదల కాగా.. మరికొందరి ఫస్ట్ లుక్స్‌తో పాటు మూవీ విడుదల తేదీని తాజాగా విడుదల చేశారు.


'పొన్నియన్​ సెల్వన్' ఒక పార్ట్‌లో చెప్పే కథ కాదని.. దానికి రెండు భాగాలు అవసరమని.. మణిరత్నం ముందుగానే నిర్ణయించుకున్నాడు.అందుకే పీఎస్ 1 పేరుతో ఈ మూవీ గురించి అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ వచ్చాడు. ఐశ్వర్య రాయ్, త్రిష, వరలక్ష్మి శరత్‌కుమార్ లాంటి నటీమణులు ఇందులో లీడ్ రోల్స్ చేస్తుండగా విక్రమ్, జయం రవి, కార్తీ లాంటి హీరోలు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


పీఎస్ 1లో యువరాణుల్లాగా నటిస్తున్న త్రిష, ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్స్‌ను ఇటీవల విడుదల చేసిన మూవీ టీమ్.. వీటికి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. వీరితో పాటు కార్తీ, జయం రవి, విక్రమ్ ఫస్ట్ లుక్స్ కూడా విడుదల అయ్యాయి. ఇక ఇంత భారీ కాస్టింగ్‌తో మణిరత్నం రికార్డులను బ్రేక్ చేయగలడా అని తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 30 వరకు ఆగాల్సిందే.



Tags

Read MoreRead Less
Next Story