Actress Abhinaya: అదనపు కట్నం కోసం వదినను వేధించిన నటి అభినయ.. రెండేళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు

Actress Abhinaya: వరకట్న వేధింపుల కేసులో కన్నడ సీనియర్ నటి అభినయకు కర్ణాటక హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
అభినయ సోదరుడు శ్రీనివాస్ భార్య లక్ష్మీదేవి 2002లో పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది అత్తింటివారిమీద. 1998లో శ్రీనివాస్‌తో వివాహమైనప్పుడు కుటుంబ సభ్యులు రూ.80 వేల నగదు, 250 గ్రాముల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మరో లక్ష కట్నం ఇవ్వాలని అత్త మామలు, ఆడపడుచు వేధించడం ప్రారంభించారని పేర్కొంది. తరువాత వారు ఆమెను తన తల్లి ఇంటికి పంపించారు.
2012లో, ఈ కేసులో ఐదుగురు నిందితులకు మేజిస్ట్రేట్ కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది, అయితే జిల్లా కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. అభినయ తండ్రి రామకృష్ణ, శ్రీనివాస్‌లు కేసు విచారణ సమయంలో మృతి చెందారు. మిగిలిన నిందితులు అభినయ తల్లి జయమ్మ, సోదరుడు చెలువకు కూడా జైలు శిక్ష పడింది. కోర్టు తీర్పు పట్ల శ్రీనివాస్ భార్య లక్ష్మీ దేవి హర్షం వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com