Aishwarya : సినిమాల్లో అవకాశాల్లేవు.. సబ్బులు అమ్ముతున్నా: ఐశ్వర్య

Aishwarya : సినిమాల్లో అవకాశాల్లేవు.. సబ్బులు అమ్ముతున్నా: ఐశ్వర్య
Aishwarya : సీనియర్ స్టార్ హీరో మోహన్‌లాల్‌తో కలిసి పనిచేసిన తమిళ నటి ఐశ్వర్య భాస్కరన్ ఇప్పుడు సబ్బులు అమ్ముతోంది.

Aishwarya: ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయంటారు పెద్దలు.. అంటే ఒకప్పుడు బాగా బతికిన వారే పరిస్థితులు తారుమారై దీనస్థితిలో ఉంటారు..సినిమా నటీ నటుల విషయంలో ఇది మరీ ముఖ్యంగా జరుగుతుంటుంది.. తాజాగా సీనియర్ నటి లక్షి కూతురు ఐశ్వర్య ఆర్థిక పరిస్థితి బాగా లేదని డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నానని తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

సీనియర్ స్టార్ హీరో మోహన్‌లాల్‌తో కలిసి పనిచేసిన తమిళ నటి ఐశ్వర్య భాస్కరన్ ఇప్పుడు సబ్బులు అమ్ముతోంది.ఆమె బటర్‌ఫ్లైస్, నరసింహం, సత్యమేవ జయతే, ప్రజా, ది ఫైర్, అగ్ని నక్షత్రం, నోట్‌బుక్ వంటి చిత్రాలలో పనిచేసి మంచి గుర్తిపు తెచ్చుకుంది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఇంటింటికీ వెళ్లి సబ్బులు విక్రయిస్తున్నానని తెలిపింది.

తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఐశ్వర్య భాస్కరన్ తనకు ఉద్యోగం లేదని, తన వద్ద డబ్బు లేదని, వీధిలో సబ్బులు అమ్ముతూ జీవిస్తున్నానని చెప్పింది. తనకు సినిమాలు చేయాలనే ఆసక్తి ఉందని, ఎవరైనా పిలుస్తారని ఆశిస్తున్నానని చెప్పింది.

సినిమాల ద్వారా నేను సంపాదించిన డబ్బు మద్యం కోసం లేదా నా కోసం ఖర్చు చేయలేదు. నా కుటుంబం కోసం ఖర్చు చేసాను. నా కెరీర్ గ్రాఫ్ మూడేళ్లు, నేను సినిమాల్లో నటించడం ప్రారంభించిన మూడేళ్ల తర్వాత నా వివాహం జరిగింది. దాంతో సినిమాల నుంచి తప్పుకున్నాను'' అని ఐశ్వర్య అన్నారు.

తనకు సినిమాలు చేయాలని ఉందని, నిర్మాతల నుంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నానని ఐశ్వర్య భాస్కరన్ తెలిపారు. సినిమా ఆఫర్లు రాకపోతే డబ్బు సంపాదించే ఏ ఉద్యోగం చేయడానికి అయినా సిద్ధమే, ఆఖరికి ఆఫీసుల్లో టాయ్ లెట్ లు కడిగే ఉద్యోమైనా చేస్తా.. ఏ పని చేయడానికైనా వెనుకాడను అని ఐశ్వర్య చెప్పింది.

ఐశ్వర్య భాస్కరన్ తన్వీర్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. 1994లో పెళ్లి చేసుకున్న వారు మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన ఆరునెలలకే భార్యభర్తల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆ జంటకు పుట్టిన పాపకు ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు విడాకులు తీసుకున్నారు.

ఐశ్వర్య తన మాజీ భర్త మరియు అతని భార్యతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పింది. ఐశ్వర్య భాస్కరన్ మలయాళ చిత్రసీమలో ఒళ్యంపుగల్ చిత్రంతో రంగప్రవేశం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story