Suma Kanakala: సుమ వల్లే నేనిలా ఉన్నా..: నటి ఎమోషనల్..

Suma Kanakala:యాంకర్ సుమ గురించి ఎవర్నడిగినా చెప్పేస్తారు.. సినిమాల్లో నటిస్తున్న తారల గురించి అడిగితే తెలియకపోవచ్చునేమో కానీ సుమ గురించి ఎవరికి తెలియదు.. ప్రతి ఇంట్లోనే బుల్లి తెరపై సుమ లేని షో ఉంటుందా.. ఆడియో ఫంక్షన్లు ఆమె లేకుండా జరుగుతాయా.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సుమని పిలవకుండా చేస్తారా.. వామ్మో.. వాటే ఎనర్జీ.. ఒన్ అండ్ ఓన్లీ యాంకర్ సుమ..
గలగలా మాట్లాడేస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేయడమే కాదు.. మంచి మనసున్న మనిషి కూడా సుమ.. తన మాటలతో ఎవర్నీ హర్ట్ చేయదు.. తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న ఓ షోకి గేస్ట్‌గా వచ్చింది నటి సుభాషిణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమ లేకపోతే నేను ఇలా మీముందు ఉండేదానిని కాదు అని కన్నీళ్లు పెట్టుకుంది.
నేనీరోజు ఇలా ఉన్నానంటే సుమనే కారణం.. ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నతనకు సుమ మందులు పంపిస్తోంది. ఆర్థికంగా సహాయం చేస్తు్న్న ఆమె ఆరు నెలలకు ఒకసారి మెడిసిన్స్ పంపిస్తుంది.
మళ్లీ నాకు మానవ జన్మ ఉంటే నా కడుపున బిడ్డగా పుట్టాలి తల్లీ నువ్వు అని సుభాషిణి అనడంతో సుమ భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు సుమపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com