పిల్లలు వద్దు.. కెరీరే ముద్దు: నటి అమృత

పిల్లలు వద్దు.. కెరీరే ముద్దు: నటి అమృత
X
నేటి తరం పెళ్లి పిల్లల కంటే కెరీర్ కే ప్రాముఖ్యతను ఇస్తున్నారు..

నేటి తరం పెళ్లి పిల్లల కంటే కెరీర్ కే ప్రాముఖ్యతను ఇస్తున్నారు.. నిజానికి పిల్లల్ని కనడం, పెంచడం అనేది ఒక భారంగానూ భావిస్తున్నారు. తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ముందుకు వెళ్లాలనుకుంటున్నారు.. జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.. పెళ్లి, పిల్లలు వాటికి ప్రతిబంధకాలు అవుతాయని భావిస్తున్నారు.. మరాఠీ నటి అమృత కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు అమృతా సుభాష్ పుట్టినరోజు. 44వ ఏటలోకి అడుగు పెట్టిన అమృత తాను నటించిన వండర్ వుమన్ సినిమా ప్ర‌మోష‌న్ స‌మ‌యంలో ప్రెగ్న‌న్సీ ఫోటోను షేర్ చేసింది. ఆమె పోస్ట్ కారణంగా అమృత తల్లి కాబోతోందని అందరూ భావించారు. కానీ నిజానికి అలాంటిదేమీ లేదు.

వండర్ వుమన్‌లో వయస్సు కారణంగా ఆలస్యంగా తల్లి అయ్యే జయ పాత్రను అమృత పోషించింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో నిజ జీవితంలో తల్లి కాబోతున్నారా అనే ప్రశ్నలు ఆమెను అడిగారు. దానికి అమృత ఎలాంటి సంకోచం లేకుండా తల్లి కావటంపై తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆమె ఆలోచనలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. ఆలోచింపజేశాయి.

అమృత ఇప్పటి వరకు వ్యక్తిగత విషయాలపై స్పందించలేదు. ఆమె తన వ్యక్తిగత మరియు వృత్తి జీవితాన్ని ఎప్పుడూ వేరుగా ఉంచుతుంది. అయితే ఈసారి చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది. ఓ ఇంటర్వ్యూలో అమృత మాట్లాడుతూ.. 'కాలం మారుతున్నట్లు అనిపిస్తుంది. పిల్లలను ప్రేమించే జంటలు నేడు చాలా మంది ఉన్నారు, కానీ నేను పిల్లలను వద్దనుకుంటున్నాము.

ఒక బిడ్డను ప్రేమించి, జన్మనివ్వడానికి , బాగా చూసుకోవడానికి చాలా శక్తి అవసరం. మేము ఈ శక్తిని వివిధ విషయాలలో ఉపయోగించాలనుకుంటున్నాము. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మంది ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు.' 'కాలంతో పాటు, పరిపూర్ణతకు నిర్వచనం కూడా మారిపోయింది. కాబట్టి స్త్రీ తన పని ద్వారా తనను తాను నిరూపించుకోవాలనుకుంటోంది.

'అంతేకాకుండా, పిల్లలను ఇష్టపడటం, పిల్లలను పెంచడం రెండు వేర్వేరు విషయాలు. ఎందుకంటే మేమిద్దరం కెరీర్‌లో బిజీగా ఉన్నాం. కాబట్టి పుట్టిన బిడ్డకు సమయం ఇవ్వగలమా, తనకు న్యాయం చేయగలమా? ఇలాంటి ఆలోచన మా మదిలో మెదిలింది. అందుకే పిల్లలు వద్దు అని నిర్ణయించుకున్నాం. మేము మా పనిని చాలా ప్రేమిస్తాము. పని మీద ప్రేమతో పిల్లను పట్టించుకోకపోవడం సరికాదు.' మా నిర్ణయాన్ని అందరూ ఆమోదించాలని కూడా మేం అనుకోవట్లేదు.. ఎవరి ఇష్టం, ఎవరి అభిప్రాయం వారిది అని అమృత ఇంటర్వ్యూ ముగించారు.

Tags

Next Story