Anasuya Bharadwaj : అనసూయకు కోపం వచ్చింది..

Anasuya Bharadwaj :  అనసూయకు కోపం వచ్చింది..
X

యాంకర్ నుంచి యాక్ట్రెస్ గా మారిన అనసూయ సోషల్ మీడియాలో అనేక విమర్శలను ఫేస్ చేస్తూ ఉంటుంది. అయినా ఎప్పుడూ వెనక్కి తగ్గదు. తనపై వచ్చే బ్యాడ్ కామెంట్స్ కు ఘాటుగా రిప్లై ఇస్తుంది. ఈ మధ్య తన ఫాలోవర్స్ ను మిలియన్స్ లో తొలగించుకుంది. అంటే అంతమంది ఆమెను ఇబ్బంది పెడుతున్నట్టుగానే భావించాలి. అలా ఇబ్బంది పెట్టేవారిని సోషల్ మీడియాలో వదిలించుకుంది కానీ.. సొసైటీలో వదిలించుకోలేకపోయింది. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లింది అనసూయ. అక్కడ కొందరు పోకిరీలు ఆమెను ఉద్దేశిస్తూ కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. దీంతో కోపంతో ఊగిపోతూ.. ‘చెప్పు తెగుద్ది’ అంటూ విరుచుకు పడింది. పెద్దవారిని ఎట్లా గౌరవించాలో మీ వాళ్లు నేర్పలేదా.. మీకు కాబోయే వైఫ్, లవర్, అమ్మ, చెల్లిని ఇలాగే ఏడిపిస్తే ఊరుకుంటారా..? అంటూ అక్కడే క్లాస్ పీకింది.

ఏదేమైనా అనసూయ తనకు నచ్చినట్టు బ్రతికేస్తుంది. 40 పదుల వయసుకు వచ్చినా ఇంకా హాట్ హాట్ డ్రెస్ లు వేసుకుంటుంది. దీనిపైనే ఎక్కువమంది ఆమె గురించి నెగెటివ్, బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటారు. వీటి విషయంలో కూడా తన భర్త, పిల్లలకు లేని ఇబ్బంది మీకెందుకు అంటూ కౌంటర్ వేస్తుంది. అవును.. ఎవరిష్టం వారిది. ఆమె లైఫ్ స్టైల్, బట్టల వల్ల సమాజానికి నష్టం ఏముందీ.. ? అనేది కొందరు ఫెమినిస్టుల వాదన. అవన్నీ ఎలా ఉన్నా.. ఈ చెప్పు తెగుద్ది అనే డైలాగ్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Next Story