Anjali : రామ్ చరణ్ కి జోడీగా అంజలి..!
Anjali : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్టుగా ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. తాజాగా రామ్ చరణ్‌కి సంబంధించిన ఓ లుక్ కూడా లీకైంది. ప్లాష్‌బ్యాక్‌లో రామ్ చరణ్ ఇలా కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ప్లాష్‌బ్యాక్‌లో కనిపించే రామ్ చరణ్‌కి జోడీగా హీరోయిన్ అంజలి నటిస్తుందన్న ప్రచారం నడుస్తోంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ సినిమాకి మెయిన్ హైలెట్ అవుతోందని సమాచారం.
ఇక కొడుకు పాత్రలో కనిపించే రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సర్కారోడు అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. RRR తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న మూవీ కావడం, మళ్ళీ అందులో గ్రేట్ డైరెక్టర్ శంకర్‌తో కావడంతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com