Salman khan : సల్మాన్‌తో కిస్ సీన్... రిజెక్ట్ చేసిన హీరోయిన్.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్..!
Salman khan : సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన మైనే ప్యార్ కియా చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరచయమయ్యారు కండల వీరుడు సల్మాన్ ఖాన్, అప్పటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో ప్రతి పాట ఇప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది భాగ్యశ్రీ.. ఆ తరవాత ఆమె స్థానాన్ని ఎవరు అందుకోలేకపోయారు కూడా.. ఇప్పటికి ఆమెను ఇష్టపడే అభిమానులు చాలా మంది ఉన్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ మధ్య ఓ కిస్ సీన్‌ని క్రియేట్ చేశారట దర్శకుడు సూరజ్ బర్జాత్యా.. భాగ్యశ్రీతో కిస్ సీన్ చేయడం ఇష్టం లేక దానిని సల్మాన్ రిజెక్ట్ చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ సీన్ చేయడం తనకి ఇష్టం లేదని ముందుగా సల్మాన్ దగ్గరికి వెళ్లి చెప్పిందట భాగ్యశ్రీ.. ఆమె ఫీలింగ్‌ని అర్ధం చేసుకున్న సల్మాన్ ఆ కిస్ సీన్‌ని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్లాస్ అడ్డుపెట్టి ఆ సన్నివేశాన్ని పూర్తిచేశారట దర్శకుడు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ గతంలో చెప్పడం విశేషం.
ఇక ఇదే సినిమా షూటింగ్‌లో మరో సీన్ చిత్రీకరించేటప్పుడు భాగ్యశ్రీ ఓ పొట్టి డ్రెస్ వేసుకోవాల్సి వచ్చిందట. ఆ డ్రెస్ వేసుకోవడం భాగ్యశ్రీకి ఇష్టం ఉన్నప్పటికీ.. అక్కడే సెట్‌లో ఉన్న ఆమె భర్తకి మాత్రం అది ఇష్టం లేదట.. దీనితో ఆమెకి వేరే డ్రెస్ వేసి ఆ సీన్ ని కంప్లీట్ చేశామని సల్మాన్ చెప్పుకొచ్చాడు. నేడు భాగ్యశ్రీ 53వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తోన్న రాధేశ్యామ్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది భాగ్యశ్రీ.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com