వెంకటేష్ 'కూతురు' వేసుకున్నగౌను బరువెంతో తెలుసా!!

వెంకటేష్ కూతురు వేసుకున్నగౌను బరువెంతో తెలుసా!!
ఎస్తేర్ అనిల్ 'దృశ్యం' లో కథానాయకుడు మోహన్ లాల్ చిన్న కుమార్తెగా నటించింది. తెలుగు రీమేక్ అయిన చిత్రంలోనూ వెంకటేష్ కుమార్తెగా నటించింది.

యువ కథానాయిక ఎస్తేర్ అనిల్ 'దృశ్యం' లో కథానాయకుడు మోహన్ లాల్ చిన్న కుమార్తెగా నటించింది. తెలుగు రీమేక్ అయిన చిత్రంలోనూ వెంకటేష్ కుమార్తెగా నటించింది. ఆమె లేటెస్ట్ గా పర్పుల్ గౌన్ ధరించి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఫోటోలను పంచుకుంటూ ఈ విధంగా రాసింది "నేను 58 కేజీల బరువున్న గౌను ధరించానంటే మీరు నమ్మగలరా? నా బరువు 44 కేజీలు నాకంటే బరువుంది నేను వేసుకున్న గౌను. డిజైనర్లు గౌన్‌ని గదిలోకి తెచ్చిన క్షణం నేను నోరు విప్పి అక్కడ నిలబడ్డాను. మొదటిసారి గౌను చూసినప్పుడు 'వావ్' అంటూ ఆశ్చర్యపోయాను.

ఈ గౌను డిజైన్ చేయడానికి వారికి 30 రోజులు పట్టింది. మనేష్, రెమీలు ఈ గౌన్ తయారు చేశారు". భారీ దుస్తులు ధరించిన ఎస్తేర్‌ అందంగా కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లక్షా యాభై వేల లైక్‌ల వర్షం కురిపించి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story