Actress Gautami Daughter: మరో నట వారసురాలు ఎంట్రీ.. ఎప్పుడంటే..

Actress Gautami Daughter: ఒకటప్పటి అందాల నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మి కూడా సినిమాల్లో రావడానికి సిద్ధమైంది. 1990లో గౌతమి అగ్రకథానాయికగా వెలిగిపోయారు.
తెలుగు, తమిళ తదితర దక్షిణాది భాషల్లో కథానాయికగా నటించిన గౌతమి మంచి ఫామ్‌లో ఉండగానే 1998లో సందీప్ భాటియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ఏడాదిలోనే దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అప్పటికే వారికి ఓ కూతరు పుట్టింది. ఆ అమ్మాయే సుబ్బులక్ష్మి.
వైవాహిక జీవితం విఫలమవడంతో నటుడు కమల్ హాసన్‌తో సహజీవనం చేసింది. ఆ బంధం కూడా పదేళ్లలో ముగిసింది. ఇప్పుడు కూతురితో ఒంటరిగా జీవిస్తున్న గౌతమి సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే గౌతమి ఆ మధ్య ప్రధాని మోదీని కలిశారు.
అయితే వాటికి కూడా ఈ మధ్య దూరంగా ఉన్న గౌతమి తన కూతురిని సినిమా హీరోయిన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకేనేమో సుబ్బులక్ష్మి తరచుగా తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఫోటోలను చూసిన నెటిజన్లు హీరోయిన్‌కి ఏ మాత్రం తగ్గని అందం.. సినిమా బ్యాగ్ గ్రౌండ్ కదా ఎంట్రీ సులువే అవుతుంది అని కామెంట్లు పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com