రవితేజ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
Tollywood: సినిమాలపై ఉన్న ప్రేమతో చాలామంది ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. హిట్స్ ఉంటే కొంతకాలం నిలదొక్కుకుంటారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఒకటి రెండు సినిమాల తర్వాత ఈ రంగానికి గుడ్ బై చెప్పెస్తారు. అయితే కొందరూ మాత్రం ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంటారు. ఇలాంటి వాళ్లలో హీరోయిన్ గోపిక ఒకరు. తెలుగు,మలయాళ,కన్నడ భాషా చిత్రాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చింది గోపిక.
కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీకి స్టడీస్ సమయంలోనే సినిమా ఛాన్స్ లు వచ్చాయి. అయితే మలయాళంలో జయసూర్య,వినీత్ లతో కల్సి చేసిన తొలిసినిమా నిరాశ పరిచింది. మాస్ మహారాజ రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన గోపిక తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. గోపిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఆ సినిమాలో ఆమె నటనకు జనం ముగ్దులయ్యారు. దాంతో విధి, లేతమనసులు,ముద్దుల కొడుకు,వీడు మామూలోడు కాదోయ్ వంటి మూవీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అజిలేష్ ని ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం గోపిక ఆస్ట్రేలియాలో ఉంటోంది. దాంతో సినిమాలను వదిలేసింది. ఫ్యామిలీతో హాయిగా గడుపుతున్న ఈమె తన ఇద్దరు పిల్లలు, భర్తతో కల్సి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. గోపిక షేర్ చేసిన ఫోటోలు బాగున్నాయని కామెంట్స్ చేస్తూనే సెంకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని కోరుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com