Ajith Kumar : అజిత్ ఓ నమ్మక ద్రోహి - హీరా

1990ల చివరి నాటి ప్రేమ జంటగా తమిళనాడులో అజిత్ కుమార్, హీరాకు మంచి క్రేజ్ ఉంది. అజిత్ హీరోగా ఎదుగుతున్న దశ అది. అప్పటికే హీరా టాప్ హీరోయిన్ గా వెలుగుతోన్న టైమ్. అలాంటి వీరి మధ్య ప్రేమ అంటే ఆనాటి మీడియా ఊరుకుంటుందా.. రకరకాల కథనాలు వచ్చేవి. ఇద్దరూ కలిసి కాదల్ కోటై, తొడరుల్ అనే చిత్రాల్లో కలిసి నటించారు. హీరా తెలుగు వారికి ఎక్కువగా డబ్బింగ్ సినిమాలతోనే ఎక్కువగా తెలిసినా తన ఫస్ట్ మూవీ అపరాధి తెలుగు చిత్రమే కావడం విశేషం. తర్వాత చాలా సినిమాలే చేసినా ఏదీ బ్రేక్ ఇవ్వలేదు. బట్ తమిళ్ లో చేసిన ఫస్ట్ మూవీ ‘ఇదయం’ అక్కడ బిగ్గెస్ట్ హిట్ కావడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. అయినా తెలుగులో అప్పుడప్పుడూ మెరిసింది. అలాంటి తనను ప్రేమించాడు అజిత్. మరి ఏమైందో కానీ కొన్నాళ్ల తర్వాత సడెన్ గా విడిపోయారు. తర్వాత అజిత్ షాలినిని పెళ్లి చేసుకున్నాడు. అదే టైమ్ లో హీరాకు ఆఫర్స్ ఆగిపోయాయి. తనూ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అలా విడిపోయిన ఇన్నేళ్ల తర్వాత అజిత్ ను ఓ నమ్మకద్రోహి అంటూ తీవ్రమైన కామెంట్స్ చేస్తూ వార్తల్లోకెక్కింది హీరా. మరి తను ఏమన్నదో తెలుసా..
అజిత్ కుమార్ నమ్మకద్రోహి, నా వ్యక్తిత్వాన్ని చంపేశాడు. అభిమానుల ద్వారా నాపై హింసను ప్రేరేపించాడు. సానుభూతి కోసం తనకు ఏదో అయిందనేలా కలరింగ్ ఇస్తూ వైద్య సమస్యలను సృష్టించాడు. అలాగే అతనిపై వచ్చే వార్తలను నియంత్రించేందుకు మీడియాకు లంచం ఇచ్చాడు..’ అంటూ ఆరోపణలు చేసింది.
నిజానికి అజిత్ వీళ్లు విడిపోయిన తర్వాత నుంచే మీడియా ముందుకు రావడం మానేశాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ అతను మీడియాను ఫేస్ చేయలేదు. అందుకు కారణాలేవైనా ఇప్పుడు హీరా చేసిన ఆరోపణలు పెద్దవే. వీటికి స్పందిస్తాడు అనుకోలేం. కాకపోతే మరోసారి అజిత్ అభిమానులు హీరాపై విరుచుకు పడతారు అని వేరే చెప్పక్కర్లేదేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com