Actress Ivana: సినిమాలో ఆ సీన్స్.. అమ్మానాన్నకి చెప్పే చేశా: మలయాళీ కుట్టి

Actress Ivana: ఎంత యాక్టర్ అయినా కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉంటాయి. అలాంటి సీన్స్‌లో నటించడం కొంచెం కష్టమే.అమ్మానాన్న కూడా ఒప్పుకోవాలి. అందరి ముందు నటించడానికి చాలా ధైర్యం కావాలి. సినిమాల్లోలకి వచ్చాక మడి కట్టుకుని కూర్చుంటే అవకాశాలు రావు.
వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. తామేంటో నిరూపించుకోవాలి. ప్రతి నటీనటులు ఇలానే అనుకుంటారు. తాజాగా మలయాళీ కుట్టి ఇవనా నటించిన లవ్ టుడే చిత్రంలో ఆమె నటించిన ఓ సన్ని వేశం అభ్యంతరకరంగా ఉంది. గత నెలలో విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ చిత్రంలో హీరోతో పడగదిలో చేసిన సన్నివేశాల గురించి మాట్లాడుతూ..
దర్శకుడు కథ చెప్పినప్పుడే ఆ సన్నివేశం గురించి నా తల్లిదండ్రులతో చర్చించాను. కథకు అవసరమైతే నటించడంలో తప్పు లేదన్నారు. నటించే ముందు తాను కూడా భయపడ్డానని చెప్పింది. కానీ ఎలాంటి అశ్లీలత లేకుండా చిత్రీకరించారు.
సినిమా చూసిన తరువాత తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ ఎలాంటి విమర్శలు చేయలేదని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఇవానా ఇలాంటి సన్నివేశం ద్వారా ప్రేక్షకులకు మంచి సందేశం ఉంటుందనే ఉద్దేశంతోనే తాను ఈ సీన్‌లో నటించడానికి మరో కారణం అని ఇవనా పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com