ఈ ప్రభాస్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి!

ఈ ప్రభాస్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి!
గత ఏడాది డిసెంబర్ 27న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ బర్త్‌డే సందర్భంగా బాలీవుడ్ నటి ఫెర్నాండెజ్‌ పోస్టు చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

గత ఏడాది డిసెంబర్ 27న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ బర్త్‌డే సందర్భంగా బాలీవుడ్ నటి ఫెర్నాండెజ్‌ పోస్టు చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన చిన్ననాటి పిక్ ను షేర్‌ చేసిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఫోటోలో ఫెర్నాండెజ్‌ బుల్లి గౌను వేసుకుని అందంగా నవ్వుతూ కనిపిస్తుంది.

ఈ ఫోటో పైన ప్రీతి జింతా, యామి గౌతమ్‌, మనీష్‌ పాల్‌, ఊర్వశి రౌతాలా వంటివారు చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సినిమాల విషయానికి వచ్చేసరికి.. 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.


ఇక సల్మాన్ ఖాన్‌తో కలిసి కిక్ , రేస్ 3 వంటి పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో ప్రభాస్ హీరోయిన్ గా వచ్చిన సాహో చిత్రంలో ఓ పాటలో అడిపడింది. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న 'బచ్చన్‌ పాండే' సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story