Acharya Trailer : ఆచార్య ట్రైలర్‌లో ఆమెకి అన్యాయం...!

Acharya Trailer : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ ట్రైలర్ రానే వచ్చింది.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్ర ట్రైలర్‌ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్.. రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో మొదలైన చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
ట్రైలర్‌లో మెగాస్టార్ చిరంజీవి కాస్త లేటుగా వచ్చినా... ఆయన ఎంట్రీ మాత్రం లేటెస్టుగా ఉంది. ట్రైలర్ చివర్లో రామ్ చరణ్, చిరంజీవిలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకి గూస్ బంబ్స్ తెప్పించాయని చెప్పాలి.. అయితే చిత్ర ట్రైలర్‌లో హీరోయిన్ కాజల్‌కి అన్యాయం జరిగిందని చెప్పాలి. ఒక్క ఫ్రేమ్‌లో అంటే ఒక్క ఫ్రేమ్‌లో కూడా కాజల్‌ని చూపించలేదు.
ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా కనిపిస్తోన్న పూజా హెగ్డేకి మాత్రం చిత్ర ట్రైలర్‌లో స్పేస్ ఇచ్చారు... కానీ మెయిన్ హీరోయిన్ అయిన కాజల్‌కి మాత్రం చోటు కల్పించలేకపోవడంతో కాజల్ అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు. కాగా కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com