ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ హీరోయిన్..టాప్ హీరోలతో నటించింది

సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు కూడా తమ అభిమానుల కోసం త్రోబ్యాక్ ఫోటోలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఫోటో ఒకటి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. తాజాగా కాజల్ అగర్వాల్ చైల్డ్ హుడ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఓ ఫోటోకు లక్షల్లో లైకులు, షేర్లు వచ్చాయి. అందులో ఈ చిన్నది ముసిముసిగా నవ్వులతో క్యూట్ లుక్ లో దర్శనమిస్తోంది. ప్రేక్షకులు తమకు నచ్చిన సెలబ్రిటీలను ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిస్తుంటారు.
కాజల్ అగర్వాల్ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు పొందింది. కాజల్ తన నటనతోటి యువత మనసుల్లో స్థానం పదిలం చేసుకుంది. మగధర సినిమాతో తన స్టార్ డమ్ సాధించింది. యువ హీరోలతో, అగ్రహీరోలతో ఆడిపాడింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఘోస్టీ, ఆచార్య, ఉమా, హే సినామికా, కరునగాపియం, ఇండియన్ 2, ప్యారిస్ ప్యారిస్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com