Keerthy Suresh: మహానటిని కూడా వదలని కరోనా...!

Keerthy Suresh: టాలీవుడ్ పైన కరోనా పంజా విసురుతుంది. వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే హీరోలు మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి కరోనా బారిన పడ్డారు. అటు సీనియర్ హీరోయిన్లు శోభన, మీనాని సైతం కరోనా సోకింది. రీసెంట్ గా రేణు దేశాయ్ ఆమె కుమారుడు అకీరా నందన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. "నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ వైద్యుల సలహాలు తీసుకుంటున్నాను. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారందరు కరోనా పరీక్షలు చేయించుకోండి.. ప్రతిఒక్కరూ కరోనా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి.. ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. కరోనా నుంచి త్వరగా కోలుకొని తిరిగి నా పనిని మొదలుపెడతా" అని ట్వీట్ చేసింది కీర్తి...
కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ సరసన సర్కారు వారి పాట, చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో ఓ కీ రోల్ పోషిస్తోంది.
— Keerthy Suresh (@KeerthyOfficial) January 11, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com