Kim Sharma: హీరోతో బ్రేకప్.. టెన్నిస్ స్టార్‌తో 'ఖడ్గం' నటి పెళ్లి..

Kim Sharma: సినీ పరిశ్రమలో క్యూట్ కపుల్ అనిపించే ఎన్నో ప్రేమజంటలు ఇప్పటికి బ్రేకప్ చేసుకొని వేర్వేరు పెళ్లిలు చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇక పెళ్లి చేసుకున్న వారిలో కూడా చాలామంది విడాకుల వైపు అడుగులేస్తు్న్నారు. ఇక ఒక యంగ్ హీరోతో చాలాకాలం డేటింగ్‌లో ఉన్న హీరోయిన్ కూడా తనతో బ్రేకప్ తర్వాత టెన్నిస్ స్టార్‌తో ప్రేమలో పడింది. అంతే కాకుండా త్వరలో పెళ్లికి కూడా సిద్ధమయిపోతున్నట్టు సమాచారం.
కృష్ణవంశీ తెరకెక్కించిన 'ఖడ్గం' సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ ఎంతోమందికి ఫేవరెట్. అయితే ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించింది కిమ్ శర్మ. ఆ తర్వాత మళ్లీ తెలుగుతెరపై కనిపించలేదు. చాలాకాలం తర్వాత మళ్లీ మగధీర సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఎక్కువగా లైమ్ లైట్‌లో ఉండకపోవడం వల్ల కిమ్ శర్మ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ప్రేక్షకులకు తెలియదు.
ముందుగా క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో కిమ్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.ఆ తర్వాత 2010లో కెన్యాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో కిమ్ వివాహం జరిగింది. కానీ కొన్నిరోజులకే తనతో ఉండలేక విడాకులు తీసుకుంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో హర్షవర్ధన్ రాణెతో డేటింగ్‌లో ఉన్న కిమ్.. ఫైనల్‌గా టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్‌తో లివిన్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తోంది. అంతే కాకుండా త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నట్టు సమాచారం.
లియాండర్ పేస్ కూడా ఇంతకు ముందు పలువురితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. కానీ కిమ్ శర్మతో గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. అంతే కాకుండా వీరిద్దరు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరు కోర్టు మ్యారేజ్‌కు సిద్ధమయినట్టు సమాచారం. ఇప్పటికే ఇరువురి కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్టు, పెళ్లి కోసం ముంబాయికి చేరుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com