Gopichand : గోపీచంద్‌కి తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది గోపీచంద్‌కి 30వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమా నుంచి ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.. సినిమాలో ఓ మెయిన్ లీడ్ రోల్‌కి ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్‌ని తీసుకున్నారు.. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా వెల్లడించారు.
సినిమాలో ఆమెది గోపీచంద్ కి అమ్మ పాత్ర అని తెలుస్తోంది. ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. కాగా లక్ష్యం, లౌక్యం వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ ప్రస్తుతం పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. UV క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్ధలు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సమ్మర్‌లో సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది.
అటు శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కుష్బూ సుందర్ ఓ కీలకపాత్ర పోషించింది. ఈ చిత్రం ఈ నెల (మార్చి 04)న రిలీజ్ కానుంది.
Team #Gopichand30 is elated to Welcome the Veteran and Ever-Versatile actress @khushsundar garu onboard 🎉
— BA Raju's Team (@baraju_SuperHit) March 3, 2022
⭐️ing @YoursGopichand
A Film by @DirectorSriwass 🎬
In @peoplemediafcy Production@IamJagguBhai @vishwaprasadtg @vivekkuchibotla pic.twitter.com/xpN1znDrBk
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com