Actress Laya: 'కచ్చా బాదం' పాటకు స్టెప్పులేసిన సీనియర్ నటి.. నెటిజన్లు ఫిదా..

Actress Laya: కచ్చా బాదం పాటకు స్టెప్పులేసిన సీనియర్ నటి.. నెటిజన్లు ఫిదా..
Actress Laya: ఒకప్పుడు తెలుగులో ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో లయ కూడా ఒకరు.

Actress Laya: ఒకప్పుడు టాలీవుడ్‌లో హిట్ సినిమాల్లో నటించి.. స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్లు అందరూ కొంతకాలం తర్వాత ఫేడవుట్ అయిపోయారు. అలా ఫేడవుట్ అయిన వారు ఇప్పుడిప్పుడే మళ్లీ లైమ్‌లైట్‌లోకి వస్తున్నారు. కొందరు హీరోయిన్లు సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటున్నారు. అలాంటి వారిలో ఒకరు లయ.


ఒకప్పుడు తెలుగులో ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో లయ కూడా ఒకరు. స్టార్ హీరోలతో నటించకపోయినా.. లయ తీసిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించేవి. అలాగే తన నటన కూడా అందరు మెచ్చేలా ఉండేది. 2005లో విడుదలయిన 'అదిరిందయ్యా చంద్రం' హీరోయిన్‌గా లయ చివరి చిత్రం. ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళంలోనే బిజీ అయిపోయారు లయ.


రవితేజ హీరోగా, శ్రీను వైట్ల తెరకెక్కించిన 'అమర్ అక్బర్ ఆంటొని' చిత్రంతో మరోసారి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది లయ. కానీ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే చాలామంది ప్రేక్షకులకు లయ రీఎంట్రీ గురించి కూడా తెలీదు. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న లయ.. వైరల్ అయిన కచ్చా బాదం పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పదేహేనేళ్ల క్రితం లయ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story