Malavika : ఆ రేప్ సీన్ తప్ప నా ఎంట్రీ 'చాలా బాగుంది' : మాళవిక

Malavika : ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన 'చాలా బాగుంది' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది నటి మాళవిక.. మొదటి సినిమాలోనే విభిన్నమైన పాత్రను పోషించి ఆకట్టుకుంది. ఆ తర్వాత 'దీవించండి', 'శుభకార్యం', 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్', 'చంద్రముఖి' తదితర సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవల అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 'సీయు ఎట్ 9' అనే హిందీ సినిమాలో ఎక్స్‌పోజ్ చేసినందుకు తన కుటుంబ సభ్యులు కోప్పడ్డారని, ఆ తర్వాత ఆ సినిమా ఎందుకు చేశానా అని రిగ్రెట్ గా ఫీల్ అయ్యానని వెల్లడించింది. ఇక తెలుగులో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే అప్పట్లో నాగార్జున అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
ఇక తాను నటించిన తొలి తెలుగు చిత్రంలోని రేప్ సీన్ తప్ప ఆ సినిమాకు పనిచేయటం మంచి అనుభూతినిచ్చిందని పేర్కొంది. తెలుగులో ఇటీవల.. 'పుష్ప' సినిమాని చూశానని, అందులోని 'ఊ అంటావా' పాటకి ఛాన్స్ వస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదానిని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com