Actress Mumtaj : నటి ముంతాజ్‌పై గృహ హింస కేసు.. మైనర్ బాలికను..

Actress Mumtaj : సినసినీ నటి ముంతాజ్ గృహ హింస ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనతో బలవంతంగా పనిచేయిస్తున్నరంటూ ఓ మైనర్ బాలిక తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. తాను సొంతురుకి వెళ్తానంటే వెళ్ళనివ్వకుండా ముంతాజ్ హింసిస్తోందని తెలిపింది.
దీనిపైన విచారణ చేపట్టిన పోలీసులు... ఆ బాలిక ఉన్న ప్రాంతానికి వెళ్లి తనతో పాటు ముంతాజ్ ఇంటిలో మరో బాలికను చెన్నైలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. ఆ బాలికను ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా.. ఆమె వయస్సు 17 ఏళ్ళుగా పోలీసులు గుర్తించారు. ముంతాజ్ ఇంట్లో గత 6 ఏళ్లుగా పనిచేస్తున్నట్టుగా ఆ బాలిక తెలిపింది.
యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంతాజ్‌పై బాల కార్మిక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక ముంతాజ్ తెలుగులో జెమినీ, ఖుషి, ఆగడు, కూలీ, తదితర సినిమాల్లో నటించింది.. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకి దూరంగా ఉంటున్న ముంతాజ్ చెన్నైలోని తన సోదరుడు ఇంట్లో ఉంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com