Ram Gopal Varma : మందుగ్లాసుతో వర్మ.. ముద్దుపెట్టిన హాట్ హీరోయిన్..!

Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురువారం (ఏప్రిల్ 7) పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీలో పలువురితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాడు వర్మ.. ఈ క్రమంలో టాలీవుడ్ హాట్ హీరోయిన్ నైనా గంగూలీ వర్మకి ముద్దుపెట్టింది.
ఓ చేతిలో గ్లాస్, మరో చేతితో నైనాని పట్టుకొని ఉన్నాడు వర్మ.. ఈ క్రమంలో నైనా గంగూలీ హ్యాపీ బర్త్‌డే అంటూ అతడి బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ వీడియోను స్వయంగా ఆ హీరోయినే తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.
కాగా వర్మ తాజాగా తెరకెక్కించిన 'డేంజరస్ (తెలుగులో మా ఇష్టం)'చిత్రంలో నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించగా, అప్సర రాణి మరో హీరోయిన్‌గా నటించింది. లెస్బియన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు కొన్ని థియేటర్లు విముఖత వ్యక్తం చేయడంతో సినిమా విడుదల వాయిదా పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com