Puneeth Rajkumar : 'ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు'.. పునీత్‌ పేరును టాటూ వేయించుకున్న నటి..!

Puneeth Rajkumar : ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు..  పునీత్‌ పేరును టాటూ వేయించుకున్న నటి..!
X
Puneeth Rajkumar : దివంగత నటుడు, కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ మరణించి నెలలు గడుస్తోన్న అభిమానులు మాత్రం ఆయన విషయాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నారు.

Puneeth Rajkumar : దివంగత నటుడు, కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ మరణించి నెలలు గడుస్తోన్న అభిమానులు మాత్రం ఆయన విషయాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నారు. పునీత్ పైన ఉన్న ప్రేమని అభిమానులు మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఏదోక విధంగా చూపిస్తూనే ఉన్నారు.

ఓ నటి అయితే ఏకంగా పునీత్ పేరును టాటూగా వేసుకుంది. కన్నడ టీవీ నటి, నాగిని 2 ఫేం నమ్రత గౌడ పునీత్‌ రాజ్‌కుమార్‌కు వీరాభిమాని. పునీత్ నటించిన మిలనా సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన పేరును చేతిపై టాటూ వేయించుకుంది.

ఆయన జయంతి సందర్భంగా వేయించుకున్న ఈ పోస్ట్‌ను రీసెంట్‌గా నమ్రత షేర్‌ చేస్తూ 'ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Tags

Next Story