సినిమా

Nidhi Agarwal : లవ్ ఫెయిల్యూర్ హీరోతో లవ్‌లో పడ్డ ఇస్మార్ట్ హీరోయిన్..!

Nidhi Agarwal : ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఓ క్రేజీ హీరోతో లవ్‌లో పడిందట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Nidhi Agarwal : లవ్ ఫెయిల్యూర్ హీరోతో లవ్‌లో పడ్డ ఇస్మార్ట్ హీరోయిన్..!
X

Nidhi Agarwal : ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఓ క్రేజీ హీరోతో లవ్‌లో పడిందట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ క్రేజీ హీరో ఎవరో కాదు అప్పట్లో నయనతార, హన్సికలతో లవ్ ట్రాక్ నడిపి విఫలమైన శింబుతో.. ఆవును... ఇప్పుడు శింబుతో నిధి పీకల్లోతు ప్రేమలో ఉందట.. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నరంటూ కోలీవుడ్ సర్కిల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

నిధి అగర్వాల్, శింబు కలిసి సుచింద్రన్‌ దర్శకత్వం వహించిన ఈశ్వరన్‌ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. శింబుతో లవ్ లో ఉన్న నిధి.. కొంతకాలంగా చెన్నైలోని శింబు ఇంట్లోనే ఉంటోందని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే..

38 ఏళ్ల శింబుకి ఇంకా పెళ్లి చేసుకోలేదు. సినిమాలతో పాటుగా ఎక్కువగా తరచూ ప్రేమ వ్యవహారంలతో వార్తల్లో నిలుస్తుంటాడు శింబు.. ఇక సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం 'హీరో', 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో నటిస్తోంది. కాగా టీంఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో నిధి ప్రేమాయణం నడిపించినట్టుగా గతంలో వార్తలు వచ్చాయి.

Next Story

RELATED STORIES