Poonam Kaur: "ఇప్పటి వరకు నాకు జరిగిన డ్యామేజ్ చాలు"... పిల్లల పై పూనమ్ క్లారిటీ...!

Poonam Kaur:  ఇప్పటి వరకు నాకు జరిగిన డ్యామేజ్ చాలు... పిల్లల పై పూనమ్ క్లారిటీ...!
X
Poonam Kaur: సినిమాల కన్నా ఇన్‌‌‌‌డైరెక్ట్ ట్వీట్లతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది సినీ నటి పూనమ్ కౌర్..

Poonam Kaur: సినిమాల కన్నా ఇన్‌‌‌‌డైరెక్ట్ ట్వీట్లతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది సినీ నటి పూనమ్ కౌర్.. ఇటీవల తన ఫ్రెండ్ పిల్లలతో సరదాగా సమయాన్ని గడిపిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ క్రమంలో పూనమ్ కౌర్ కి పెళ్లైందని, వారు పూనమ్ కౌర్ పిల్లలేనంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనితో వీటిపైన పూనమ్ రియాక్ట్ అయింది.

"ఇప్పటి వరకు నాకు జరిగిన డ్యామేజ్ చాలు.. వాళ్లు నా ఫ్రెండ్ పిల్లలు.. సోషల్ మీడియాకు థ్యాంక్స్.. నేను క్లారిటీ ఇవ్వగలను.. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి.. బతకనివ్వండి " అంటూ ట్వీట్ చేసింది. కాగా మాయాజాలం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీకి అనుకున్నంతగా హిట్స్ పడలేదు.

Tags

Next Story