Poorna Marriage Pics: దుబాయ్ జేబీఎస్ గ్రూప్ సీఈవోను పెళ్లి చేసుకున్న నటి పూర్ణ..

Poorna Marriage Pics: నటిగా వెండి తెరపై, జడ్జిగా బుల్లితెరపై సందడి చేస్తున్న పూర్ణ దుబాయ్‌కి చెందిన ఆసీఫ్ అలీని వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మలయాళ నటి పూర్ణ అసలు షమ్నా కాశిం. 2007లో వచ్చిన శ్రీ మహాలక్ష్మితో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఆ తరువాత సీమ టపాకాయ్, అవును, అవును-2, లడ్డూబాబు, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతూ బుల్లితెర జడ్జిగా కొనసాగుతోంది.
పూర్ణ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ.. తన భర్తని ఉద్దేశిస్తూ.. నేను ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళను కాకపోవచ్చు, అద్భుతమైన జీవిత భాగస్వామికి సంబంధించిన అన్ని లక్షణాలను కలిగి ఉండకపోవచ్చు, కానీ మీరు నన్ను ఎప్పుడూ తక్కువగా చూడలేదు.. మీరు నన్ను ఎప్పుడూ ఎలా ప్రేమిస్తున్నారో అలాగే నన్ను మార్చడానికి కూడా ప్రయత్నించలేదు.
ఇది నేను అత్యుత్తమంగా ఉండటానికి నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ప్రేరేపించింది. ఈ రోజు నుంచి మన అద్భుతమైన జీవితం కొనసాగుతుంది. మీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను అని ఇన్‌స్టా పోస్టులో పూర్ణ తన మనసులోని భావాలను పంచుకున్నారు.
రిసెప్షన్, సంగీత్ మరియు మెహందీ వేడుకలు గతంలో దుబాయ్‌లో జరిగాయి. JBS గ్రూప్ CEO షమ్నా భర్త. ప్రస్తుతం పూర్ణ తమిళం, మలయాళం, తెలుగు భాషలలో పదం పేసుమ్, దసరా, బ్యాక్ డోర్, వృత్తం, అమ్మాయి, పిసాసు 2 వంటి ఆరు చిత్రాలలో పని చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com