Poorna : 'అవును'.. హీరోయిన్ పూర్ణ పెళ్లి పీటలెక్కబోతోంది..!
Poorna : 'అవును'.. మీరు విన్నది నిజమే... హీరోయిన్ పూర్ణ పెళ్లి పీటలెక్కబోతోంది..ఈ విషయాన్ని అమె స్వయంగా వెల్లడించింది... కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడబోతున్నట్లుగా తెలిపింది.. 'కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను' అంటూ కాబోయే భర్తతో దిగిన ఫొటోను షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చూస్తుంటే వీరిద్దరికి ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనితో పూర్ణకి సినీ సెలబ్రిటీలతో పాటుగా, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఆమె భర్త షానిద్ బడా వ్యాపారవేత్త. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను స్థాపించిన ఆయన వాటికి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు.
ఇక పూర్ణ సినిమాల విషయానికి వస్తే.. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమె అనుకున్న స్ధాయిలో హీరోయిన్ గా రాణించలేకపోయింది.. ఇటీవల బ్యాక్‌డోర్, అఖండ వంటి చిత్రాలతో తన నటనతో మెప్పించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com