Pragathi Dance : నడిరోడ్డుపై ప్రగతి తీన్మార్ డ్యాన్స్.. మేడమ్ సార్ మేడమ్ అంతే..!

Pragathi Dance : నటి ప్రగతి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా ఫేమస్ ప్రగతి... సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు.. ముఖ్యంగా వర్కవుట్ వీడియోలతో నెటిజన్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రగతి తీన్మార్ స్పెప్టులతో అదరగొట్టింది.
నడిరోడ్డుపై డప్పు సౌండ్స్‌కి హుషారుగా స్టెప్పులేసింది. 'ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అస్సలు మిస్ కావొద్దు. మీ పిచ్చిని బయటపెట్టాలి' అంటూ ఆ వీడియోకి జత చేసింది. 44ఏళ్ల వయసులో కూడా ఇలాంటి స్పెప్టులతో ఆదరగోట్టడం గ్రేట్ మేడమ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఎఫ్3 చిత్రంతో పాటుగా పలు చిత్రాలలో ఆమె నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com