Actress Pragathi: దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరో కూడా.. గడిపితేనే ఛాన్స్ ఇస్తామని.. : ప్రగతి షాకింగ్ కామెంట్స్

Actress Pragathi: అవకాశాలకోసం అవమానాలెన్నో భరించాలి.. అడ్డదారులెన్నో తొక్కాలి. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉండాలన్నా ఆత్మాభిమానం చంపుకోవాల్సిందేనా.. అవుననే అంటోంది నటి ప్రగతి. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కి గురయ్యానని తెలిపింది ఓ ఇంటర్వ్యూలో.
ఫిట్‌నెస్‌పై ఎక్కువగా ఫోకస్ చేసే ప్రగతి అప్పుడప్పుడు తన వర్కవుట్‌కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది.. ఇంకా తనకు ఇష్టమైన డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటుంది సోషల్ మీడియా వేదికగా. ఆమె షేర్ చేసిన వీడియోలు వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
అలాగే అప్పుడప్పుడు ఆమె చేసే కామెంట్స్ కూడా వైరల్ అవుతుంటాయి. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా బయటపెట్టే ప్రగతి ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన అవమానాల గురించి చెప్పింది. దర్శక, నిర్మాతలతో పాటు .. ఓ స్టార్ హీరో కూడా తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఆ హీరో నుంచి తాను తప్పించుకున్నానని తెలిపింది. ఇంతకీ ఆ హీరో ఎవరనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంచింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రగతి చెప్పడం ఇదేమీ మొదటిసారి కాదు.. గతంలో కూడా కొన్ని సార్లు ఈ టాపిక్‌పై మాట్లాడింది.
కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఓ స్టార్ గురించి ప్రస్తావించే సరికి ఆ హీరో ఎవరు అన్న డిస్కషన్ నెట్టింట్లో నడుస్తోంది. ప్రగతి చెప్పిన మాటలకు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకంటే సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారు ఎక్కువమంది ఉంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com