Priyamani : ఇక తగ్గేదేలే.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన ప్రియమణి.. !

Priyamani : అందంతో పాటు మంచి అభినయంతో ఆకట్టుకోగల అతికొద్ది మంది నటుల్లో ప్రియమణి ఒకరు.. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పెళ్ళైనకొత్తలో, గోలీమార్, శంభో శివ శంభో, యమదొంగ మొదలగు తెలుగు చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మలయాళీ, తమిళ్ భాషల్లో నటించింది. ఇక 2017లో ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకున్న ప్రియమణి.. ఆ తర్వాత సినిమాలకి కాస్తా బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోతుంది.
గతేడాది నారప్పతో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ తాజాగా భామాకలాపం అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఇందులో ప్రియమణి నటనపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు.ఈ వెబ్ సిరీస్ సక్సెస్ కావడంతో ప్రియమణి రెమ్యునరేషన్ పెంచేసిందన్న టాక్ ఫిలిం నగర్ లో జోరుగా నడుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కి గాను ప్రియమణి రోజుకు దాదాపు 1.5 లక్షల రూపాయలు తీసుకుందని, ఇప్పుడు ఏకంగా రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు డిమాండ్ చేస్తోందట.. కాగా ప్రస్తుతం రానా హీరోగా వస్తున్న విరాటపర్వం సినిమాలో ప్రియమణి కీలకపాత్రలో నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com