Radhika : చిరంజీవిని 23 సార్లు కొట్టిన రాధిక.. ఏమైందంటే..!

Radhika :మెగాస్టార్ చిరంజీవి, రాధిక అంటే సూపర్ హిట్ కాంబినేషన్... మెగాస్టార్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ కూడా ఆమెనే కావడం విశేషం. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న రాధిక.. మెగాస్టార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
న్యాయంకావాలి తన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకొచ్చింది రాధిక. అయితే ఈ సినిమాలో హీరో చిరంజీవిని కొట్టే సన్నివేశం ఉంటుంది.. ఆ సీన్ బాగా పండేందుకు ఏకంగా 23 టేకులు తీసుకున్నానని, అలా 23 సార్లు కొట్టడంతో చిరంజీవి ముఖం ఎరుపెక్కిందని రాధిక తెలిపారు.
ఇక దర్శకుడు భారతీరాజాతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తనకెలాంటి బేధభావం లేదని, అన్ని మతాల పండగలను జరుపుకొంటానని తెలిపారు. అటు శరత్ కుమార్‌తో ప్రేమ, పెళ్లి సంగతులను వివరించారు.. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అటు గతంలో చిరంజీవి సినిమాలో విలన్‌గా చేయడానికైనా రెడీ కానీ ఆయనకు మదర్‌గా మాత్రం నటించనని చెప్పుకొచ్చింది రాధిక.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com