Anil Ravipudi : ఆ సినిమాకి ముందుగా రకుల్ ని హీరోయిన్‌గా అనుకున్నాము.. కానీ

Anil Ravipudi : కేరటం సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ఫేమ్ సంపాదించుకుంది. లౌక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. వాస్తవానికి కేరటం సినిమా కంటే ముందు తెలుగులో రకుల్‌కి చాలానే సినిమా ఆఫర్స్ వచ్చాయి. అందులో కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ కూడా ఒకటి.
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది.. అయితే ముందుగా ఈ సినిమాకి హీరోయిన్‌గా రకుల్ ని ఫిక్స్ చేశారు. కానీ సినిమా లేట్ అవుతుండడం, రకుల్‌కి మరో సినిమా ఆఫర్ రావడం, హీరోయిన్‌గా బిజీ అవ్వడంతో రకుల్ ప్లేస్ లో శృతిసోదిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అన్ని అప్పుడు కుదురి ఉంటే పటాస్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యేదని వెల్లడించారు. కాగా ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ముందుగా హీరోయిన్‌గా రకుల్‌ని అనుకున్నారు.. కొద్దిరోజులు ఆమెతో షూట్ కూడా చేశారు.. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లో కాజల్‌ని తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com