Rashmika Mandanna Net Worth : రష్మిక ఆస్తి ఎన్ని కోట్లు.. ఒక్కో సినిమాకి ఆమె రెమ్యునరేషన్ ఎంత?

Rashmika Mandanna Net Worth : రష్మిక ఆస్తి ఎన్ని కోట్లు.. ఒక్కో సినిమాకి ఆమె రెమ్యునరేషన్ ఎంత?
X
Rashmika Mandanna Net Worth : టాలీవుడ్‌‌లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ లలో రష్మిక మందన్న ఒకరు..

Rashmika Mandanna Net Worth : టాలీవుడ్‌‌లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ లలో రష్మిక మందన్న ఒకరు.. గత ఏడాది పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రంతో భారీ హిట్ కొట్టి మంచి ఫామ్‌‌లో ఉంది. ఇప్పుడు ఆమె చేతిలో టాప్ హీరోల సినిమాలున్నాయి. అయితే ఒక్కో సినిమాకి రష్మిక ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది.. ఆమె ఆస్తి ఎన్ని కోట్లని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.


కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో జన్మించన రష్మిక.. అక్కడ కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. మోడల్‌‌గా తన కెరీర్ మొదలు పెట్టిన రష్మిక ఆ తర్వాత హీరోయిన్‌‌గా మారింది. 2016లో కన్నడలో వచ్చిన కిరిక్ పార్టి చిత్రంతో వెండితెరకి పరిచయమైంది. ఆ తర్వాత ఛలో చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో టాప్ హీరోయిన్ అయిపొయింది రష్మిక.


రష్మిక ఒక్కో సినిమాకు 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.. ఇక ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట.. మొత్తం ఏడాదికి ఆమె వేతనం సుమారుగా 5 కోట్లని తెలుస్తోంది. ఆమె ఆస్తి మొత్తం రూ. 37 కోట్లు ఉంటుందని సమాచారం.. అటు రష్మిక తన కుటుంబంతో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో నివసిస్తోంది.

Tags

Next Story