Regina: ప్రెస్‌మీట్‌లో రెజీనా ఫైర్.. అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా అంటూ..

Regina: నివేదా థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకిని డాకిని' ఈనెల 16న విడుదలవడానికి సిద్ధమవుతోంది. చిత్ర కథ కొరియన్ సినిమా మిడ్‌నైట్ రన్నర్స్‌కు తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఇది యాక్షన్, కామెడీతో పాటు ఓ సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుంది అని చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నటి రెజీనా తెలిపారు.
ఈ క్రమంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రెజీనా ఇబ్బందికి గురైంది. మేడమ్ మీకు ఈ సినిమాలో ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్) ఉన్నట్లు కనిపించారు.. నిజజీవితంలో కూడా అలాగే ఉంటారా అని అడిగేసరికి రెజీనా కొంత అసహనానికి గురైంది. అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా.. అది సినిమాలో భాగం మాత్రమే.. వ్యక్తిగతంగా శుభ్రత ఇష్టపడే వ్యక్తినే కానీ ఓసీడీ లాంటి సైకలాజికల్ డిజార్డర్ ఏమీ లేదు అని రెజీనా బదులిచ్చింది.
అయ్యో.. నా ఉద్దేశ్యం అది కాదు మేడమ్.. కరోనా తరువాత అందరికీ శుభ్రత పట్ల అవగాహన వచ్చింది. కొందరిలో అది మరింత ఎక్కువైంది. అలాగే మీరు కూడానా అని అడిగాను అంతే అని విలేఖరి రెజీనాకు వివరణ ఇచ్చుకున్నారు.
ఇద్దరు ట్రైనీ పోలీసులు ఒక క్రైమ్‌ను ఎలా డీల్ చేశారనేది ఈ చిత్ర కథాంశం. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్యూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com