Samantha : 'నా మౌనం అంగీకారం కాదు'.. వారి పై సామ్ ఫైర్..!

Samantha : నా మౌనం అంగీకారం కాదు.. వారి పై సామ్ ఫైర్..!
Samantha : ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్ లో సామ్ వేసుకున్న డ్రెస్ పైన నెటిజన్లు గట్టిగానే ట్రోల్ చేశారు.

Samantha : ట్రోలర్స్ కి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్ లో సామ్ వేసుకున్న డ్రెస్ పైన నెటిజన్లు గట్టిగానే ట్రోల్ చేశారు. అయితే వాటిని గత కొద్దిరోజులుగా చూస్తోన్న సామ్.. ఇవ్వాళ ట్విట్టర్ వేదికగా స్పందించింది.

"నా మంచితనాన్ని చేతకానితనం అనుకోవద్దు.. నా మౌనం అంగీకారం కాదు. ప్రతి ఒక్క విషయానికి హద్దు అనేది ఉంటుంది" అని రాసుకొచ్చింది. చైతూతో విడాకుల తర్వాత సామ్ తరుచుగా ట్రోల్ చేయబడుతుంది.

ఇక సమంత సినిమాల విషయానికి వచ్చేసరికి గతేడాది పుష్పలో ఐటెం సాంగ్ చేసి తన పాపులారిటిని మరింతగా పెంచుకున్న సామ్.. తెలుగులో శాకుంతలం, యశోద, విజయ్ దేవరకొండతో సినిమాలు చేస్తోంది. తమిళ్ లో విజయ్ సేతుపతితో పాటుగా ఓ హాలీవుడ్ మూవీ చేస్తోంది.


Tags

Next Story