Actress Sana: ఇంటిమేట్ సీన్స్‌లో సన.. ఇకపై ఇలాంటి పాత్రలు వస్తే..

Actress Sana: ముద్దుగా, బొద్దుగా ఉండే సన అమ్మవారి పాత్ర వేస్తే ఆ దేవతే ఆమె రూపంలో ప్రత్యక్షమైందేమో అనుకునేలా ఉంటుంది ఆమె రూపం. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వందల సినిమాల్లో నటించిన సన నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. హీరోయిన్లతో పోటీ పడే అందం ఉన్నా, హీరోయిన్‌గా నటించే అవకాశాలు వచ్చినా వద్దనుకుంది.. ఎక్స్‌పోజింగ్ అంటే ఇష్టపడని సన తన మనసుకు నచ్చిన పాత్రలనే ఎంచుకుని ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. అయితే తాజాగా తాను నటించిన వెబ్‌సిరీస్ మెట్రో కథలు లో నటుడు అలీ రజాతో ఇంటిమేట్‌సీన్స్‌లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీని గురించి మాట్లాడుతూ తాగుబోతు భర్తతో ఓ మిడిల్ క్లాస్ మహిళ పడే బాధలు, కష్టాలను ఈ సిరీస్‌లో ప్రత్యేకంగా చూపించారు. ఇలాంటి మహిళల గురించి సమాజం ఎలా మాట్లాడుకుంటుంది అని విషయాన్ని చూపించారు. భర్త చేసిన తప్పుకు ఆమె ఎలా బలవుతుందో చూపించారు. నా పాత్ర ప్రతి మహిళకు కనెక్ట్ అవుతుంది. ఆ పాత్రని చాలా నీట్‌గా ప్రజెంట్ చేశారు. అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా చాలా మంచిది. అందుకే నేను ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నా. భవిష్యత్తులో ఇలాంటి స్టఫ్ ఉన్న రోల్స్ వస్తే తప్పకుండా చేస్తా అని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com