Sanjjanaa Galrani : మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ సంజన..!

Sanjjanaa Galrani : మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ సంజన..!
X
Sanjjanaa Galrani : బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సంజనా గల్రానీ మగబిడ్డకు జన్మనిచ్చింది.

Sanjjanaa Galrani : బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సంజనా గల్రానీ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. దీనితో అభిమానులు, సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు.

మరోవైపు, సంజనా గల్రానీ సోదరి, నిక్కీ గల్రానీ వివాహం నటుడు ఆది పినిశెట్టితో ఈరోజు చెన్నైలో సంప్రదాయబద్ధంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా శాండల్‌ వుడ్‌ డ్రగ్స్‌ కేసులో మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంజన.. బెయిల్‌పై బయటకు వచ్చి ప్రియుడు డాక్టర్‌ పాషాను 2021 జనవరిలో పెళ్లి చేసుకుంది.

Tags

Next Story