జబర్దస్త్ రూపురేఖలు మార్చేసిన 'సత్యశ్రీ'..!

జబర్దస్త్ రూపురేఖలు మార్చేసిన సత్యశ్రీ..!
ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్ కామెడీ షో.. ఏనమిదేళ్ళ కిందట మొదలైన ఈ షో ఎక్కడ కూడా క్రేజ్ తగ్గకుండా టాప్ టీఆర్పీతో దూసుకుపోతుంది.

ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్ కామెడీ షో.. ఏనమిదేళ్ళ కిందట మొదలైన ఈ షో ఎక్కడ కూడా క్రేజ్ తగ్గకుండా టాప్ టీఆర్పీతో దూసుకుపోతుంది. అయితే ఈ షో మొదట్లో లేడీ కమెడియన్లు ఉండేవాళ్ళు కాదు.. మొగవాళ్ళే లేడీ గెటప్స్ వేసేవారు. ఎందుకంటే కొడితే బాగుండదు...కాలితో తన్నితే బాగుండదు కాబట్టి.


అయితే ఎక్కువగా ఫ్యామిలీ స్కిట్‌‌లు చేసి ఆడియన్స్‌‌కి బాగా కనెక్ట్ అయిన చమ్మక్‌‌చంద్ర మాత్రం జబర్దస్త్ లోకి ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి పేరు సత్యశ్రీ.. సీరియల్స్‌‌లో నటిస్తున్నప్పటికీ ఆమెకి రాని గుర్తింపు .. జబర్దస్త్ లో చంద్ర పక్కన చేసి బాగా ఫేమస్ అయింది. సత్యశ్రీ మంచి నటి మాత్రమే కాదు.. మంచి డాన్సర్ కూడా.. చంద్రతో కలిసి పోటాపోటీగా డాన్స్ చేసేది.


చంద్ర జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడంతో ఆమెకూడా జబర్దస్త్ ను వీడింది. కానీ ఆమె చాలా మంది లేడి కమెడియన్స్ కి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఓ దారి చూపిందని చెప్పాలి. సత్యశ్రీ వచ్చిన తర్వాత చాలా మంది టీంలీడర్స్ మిగతా లేడి కమెడియన్స్‌‌కి ఛాన్స్‌‌లు ఇవ్వడం మొదలు పెట్టారు.


మరికొందరు జబర్దస్త్ లోకి రావడానికి ఆమె ఇన్‌‌స్పైర్‌‌గా నిలిచింది. ఇప్పుడు రోహిణి, వర్ష, పవిత్ర లాంటి లేడీ కమెడియన్లు వరుసగా స్కిట్లు చేస్తూ మంచి ఫేం సంపాదించుకున్నారు. అయితే ఈ క్రెడిట్ మొత్తం సత్యశ్రీది మాత్రమే అని అనలేం కానీ జబర్దస్త్ లో లేడీ కమెడియన్ల ఎంట్రీకి ఓ రూట్ వేసింది మాత్రం ఆమె అని చెప్పాలి.Tags

Read MoreRead Less
Next Story