Shruti Haasan : హీరోయిన్‌గా శృతిహాసన్ ఇప్పటివరకు ఎంత సంపాదించిందంటే...!
Shruti Haasan : కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది శృతిహాసన్.. కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా వచ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో మొదటిసారి నటించింది. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును అందుకుంది శృతి.
ఇక స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న సలార్ మూవీలో నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ సినీయర్ నటుడు మిథున్ చక్రవర్తితో కలిసి 'బెస్ట్ సెల్లర్' అనే వెబ్‌సిరీస్ ని చేసింది.. ఇది ఫిబ్రవరి 18న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
అయితే ప్రమోషన్ లో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది శృతి.. హీరోయిన్ గా ఎంత సంపాదించారన్న ప్రశ్నకి శృతి సమాధానం ఇస్తూ.. 'నేను ప్రస్తుతం నా ప్రాపర్టీస్ గురించే తెలుసుకునే పనిలోనే ఉన్నాను. వాటి విలువ ప్రస్తుతం ఉన్న దానికంటే ఎక్కువ కావాలని కోరుకుంటున్నా. నాకు తెలిసి వాటి విలువ దాదాపు ఆరు మిలియన్ డాలర్లు అంటే 45 కోట్లకు పైగా ఉండొచ్చు' అని తెలిపింది.
అటు తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా గురించి మాట్లాడుతూ.. తనో టాప్ డూడుల్ ఆర్టిస్ట్ అని చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com