Actress Soujanya Suicide: బుల్లితెర నటి ఆత్మహత్య.. ఆ ఒత్తిడే కారణమా?

Actress Soujanya Suicide: చేతినిండా సంపాదన ఉంటే సంతోషంగా ఉండొచ్చు అనుకునేవారు చాలామందే ఉంటారు. ఒకవేళ అదే నిజమయితే రెండు చేతులా సంపాదించే నటీనటులు ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడతారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ ఆత్మహత్యలు మరింత పెరిగాయి. పని ఒత్తిడి వల్లనో, ఇంకే ఇతర కారణాల వల్లనో సినీరంగంలోని చాలావరకు యూత్ చావునే సొల్యూషన్ అనుకుంటున్నారు.
చాలా కష్టపడి గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టి మెల్లమెల్లగా గుర్తింపు సాధించుకున్న ఒక కన్నడ నటి కూడా తాజాగా ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా నటులకంటే సీరియల్ నటులకే ఎక్కువ డిమాండ్ ఉంది. అలా కన్నడలో బుల్లితెర నటిగా పేరు తెచ్చుకుంది సౌజన్య. తను బెంగుళూరులోని కుంబల్‌గోడులో తన అపార్ట్‌మెంట్‌లో ఈరోజు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే తన అపార్ట్‌మెంట్‌లో ఒక సూసైడ్ నోట్ కూడా దొరికిందని పోలీసులు మీడియాకు తెలిపారు. అందులో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని సౌజన్య రాసింది. అంతే కాక ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నందుకు అమ్మానాన్నలకు క్షమాపణ తెలిపింది. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ, తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలతో మానసికంగా బాధపడుతున్నాని నోట్‌లో పేర్కొంది. 25 ఏళ్ల సౌజన్య బుల్లితెరపై తన మార్క్ క్రియేట్ చేయడమే కాక పలు సినిమాల్లో కూడా నటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com